- రైతు సంఘర్షణ సభకు విస్తృత ఏర్పాట్లు చేయాలని ఆదేశం
- కాజీపేట సేయింట్ గ్యాబ్రియల్ స్కూల్ గ్రౌండ్‌లో హెలీపాడ్ కోసం స్థలం పరిశీలన
అక్షరశక్తి, కాజీపేట : టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సోమవారం మధ్యాహ్నం హన్మకొండకు వచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మే 6వ తేదీన నిర్వహించనున్న రైతు సంఘర్షణ సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సభకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరుకానున్న నేపథ్యంలో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈక్రమంలోనే హెలీప్యాడ్ కోసం కాజీపేట సెయింట్ గ్యాబ్రియల్ పాఠశాల మైదానాన్ని కాంగ్రస్ నేతలతో కలిసి రేవంత్ పరిశీలించారు.
అదేవిధంగా బహిరంగ సభ జరగనున్న హన్మకొండలోని ఆర్ట్స్ కళాశాల మైదానాన్ని కూడా నేతలు పరిశీలించారు. రాహుల్ గాంధీ సభను విజయవంతం చేయాలని , పెద్ద ఎత్తున జనసమీకరణ చేపట్టాలని రేవంత్‌రెడ్డి పార్టీ నాయకులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావుతోపాటు వరంగల్, హన్మకొండ జిల్లాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, డీసీసీబీ మాజీ చెర్మన్ జంగా రాఘవరెడ్డి, 62వ డివిజన్ కార్పొరేటర్ జక్కుల రవీందర్ యాదవ్, 63వ డివిజన్ కార్పొరేటర్ విజయశ్రీ రజాలి తదితరులు ఉన్నారు.