పెట్రోల్‌పై ఏపీ, తెలంగాణ వ్యాట్ తగ్గించాలి..
దేశంలో కరోనా పరిస్థితిపై అన్ని రాష్ట్రాలతో నిర్వహించిన రివ్యూ మీటింగ్‌లో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించిందని.. కానీ రాష్ట్రాలు మాత్రం వ్యాట్‌ను తగ్గించడం లేదని అన్నారు. రాష్ట్రాలు వ్యాట్‌ను తగ్గించకపోవడం వల్లే ప్రజలపై భారం పడుతోందని పేర్కొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు వ్యాట్‌ను తగ్గించాలని కోరుతున్నానని అన్నారు. తాను ఎవరినీ తప్పు బట్టడం లేదని .. ప్రజలపై భారం తగ్గించాలనే విజ్ఞప్తి చేస్తున్నానని ప్రధాని మోడీ చెప్పారు.
కాగా మనదేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు మండిపోతున్నాయి. తెలంగాణలో పెట్రోల్ రూ.120, డీజిల్ 105కి చేరింది. కొన్ని రాష్ట్రాల్లో ఇంకా ఎక్కువే ఉంది. పెరిగిపోతున్న ఇంధన ధరలను తగ్గించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో పెట్రోల్ డీజిల్ ధరలపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం.