అక్షరశక్తి, హన్మకొండ : పార్టీకి నష్టం జరిగేలా వ్యవహరించే కాంగ్రెస్ నాయకులను రాహుల్ గాంధీ తీవ్రంగా హెచ్చరించారు. అలాంటి నాయకులు తమకు అవసరం లేదని, వారు టీఆర్ఎస్, బీజేపీలోకి వెళ్లొచ్చని స్ఫష్టంచేశారు. ఆ రెండు పార్టీలతో ఒప్పందం కుదుర్చుకున్న నాయకులు కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్లాలన్నారు. పార్టీకి నష్టం చేస్తే మాత్రం సహించేదిలేదని, నేతలు ఏ స్థాయివారైనా బహిష్కరిస్తామన్నారు. తెలంగాణను మోసంచేసిన వ్యక్తితో, పార్టీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోదని కుండబద్దలు కొట్టారు. రాబోయే కాలంలో టీఆర్ఎస్‌తోనే తమ పోరాటం అని రాహుల్‌గాంధీ స్ఫష్టం చేశారు. అంతేగాక.. పొత్తులపై ఏ కాంగ్రెస్ నాయకుడు అడిగినా బయటకు పంపుతామని హెచ్చరించారు.
Previous article
Next article
Latest News