Saturday, July 27, 2024

జేఈఈ మెయిన్‌లో రెజొనెన్స్ హ‌వా..

Must Read
  • తొమ్మిది మందికి 99 శాతానికి పైగా..
  • 41 మంది విద్యార్థుల‌కు 95 కంటే ఎక్కువ శాతం
  • విద్యార్థుల‌ను అభినందించిన క‌ళాశాల చైర్మన్ లెక్కల రాజిరెడ్డి
    అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : దేశవ్యాప్తంగా ఐఐటీ, ఎన్‌ఐటీల్లో ప్రవేశాల‌కుగాను జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్‌ పరీక్షా ఫలితాల్లో హ‌న్మ‌కొండ బాల‌స‌ముద్రంలోని రెజొనెన్స్ క‌ళాశాల విద్యార్థులు స‌త్తా చాటారు. జాతీయ స్థాయి పోటీ ప‌రీక్ష‌లో అత్య‌త్త‌మ ఫ‌లితాలు సాధించారు. వరంగల్ బ్రాంచ్‌కు చెందిన తొమ్మిది మంది విద్యార్థులు 99 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించారు. 41 మంది విద్యార్థులు 95 అంతకంటే ఎక్కువ శాతం సాధించారు. 70 మంది విద్యార్థులు 90 కంటే ఎక్కువ శాతం మార్కులు సాధించార‌ని క‌ళాశాల చైర్మన్ లెక్కల రాజిరెడ్డి తెలిపారు. ఈసంద‌ర్భంగా క‌ళాశాల‌లో ఏర్పాటు చేసిన స‌మావేశంలో ఉత్త‌మ ఫలితాలు సాధించిన విద్యార్థుల‌ను రాజిరెడ్డి అభినందించారు. అధ్యాప‌కుల కృషి, విద్యార్థుల క‌ష్టం, ప్ర‌ణాళిక బ‌ద్ధ‌మైన విధానం వ‌ల్లే ఉత్త‌మ ఫ‌లితాలు సాధించ‌గ‌లిగామ‌ని అన్నారు. ఈ సంద‌ర్భంగా మేనేజ్‌మెంట్ సభ్యుల‌కు, టాప్ పర్సంటైల్ విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఆయ‌న కృతజ్ఞతలు తెలిపారు.
- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img