- జిల్లాలోకి హాత్ సే హాత్ జోడో యాత్ర..
- పాదయాత్రను విజయవంతం చేయాలి
- మాజీ కేంద్ర మంత్రి పోరిక బలరాంనాయక్
అక్షరశక్తి, మహబూబాబాద్ : రేవంత్‌రెడ్డి పాదయాత్రను విజయవంతం చేయాలని మాజీ కేంద్ర మంత్రి పోరిక బలరాంనాయక్ పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో డీసీసీ అధ్యక్షుడు జెన్నారెడ్డి భరత్ చంద్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన విలేకరుల సమావేశానికి ముఖ్య అతిథిగా పోరిక బలరాంనాయక్ హాజరై మాట్లాడారు. టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మేడారంలో చేపట్టిన హాత్ సే హాత్ జొడో యాత్ర నేడు మహబూబాబాద్ నియోజకవర్గంలోని కేసముద్రం మండలం పెనుగొండ గ్రామానికి రాత్రి 9 గంటలకు చేరుకుంటుందన్నారు. రాత్రికి రేవంత్‌రెడ్డి అక్కడే బస చేస్తారని, రేపు (బుధవారం) ఉదయం 8:30 నుండి బస చేసిన స్థలం నుండి పాదయాత్రగా ఈదులపూసపల్లికి చేరుకుంటారన్నారు. మధ్యాహ్నం భోజనం విరామం 1 నుండి 3 గంటల వరకు (నియోజకవర్గ బూత్ కోఆర్డినేటర్స్, మీడియా వారితో చిట్ చాట్) ఉంటుందన్నారు. - ఈదులపూసపల్లి నుండి మధ్యాహ్నం 3 గంటలకు మొదలై యాత్ర మహబూబాబాద్ బస్ స్టాండ్ మీదుగా మదర్ థెరిస్సా విగ్రహం, అండర్ బ్రిడ్జి నుండి నెహ్రు సెంటర్ మీదుగా ముత్యాలమ్మ తల్లి గుడి వద్దకు చేరుకుంటుందన్నారు. అక్కడ సాయంత్రం 6 గంటలకు సభ ఉంటుందన్నారు. మహబూబాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు భారీ ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన కోరారు.
- ఈమేరకు మంగళవారం టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బస చేసే స్థలంతోపాటు కార్నర్ మీటింగ్ స్థలాన్ని నేతలు పరిశీలించారు. ఈ సమావేశంలో ఏఐసీసీ సెక్రెటరీ రోహిత్ చౌదరి,పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు, టీ పీసీసీ జనరల్ సెక్రెటరీ వెన్నం శ్రీకాంత్ రెడ్డి, జిల్లా మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు నునవత్ రాధ, పీసీసీ సభ్యులు గుగులోత్ దశ్రు నాయక్, జిల్లా కాంగ్రెస్ నాయకులు గణపురపు అంజయ్య, చుక్కల ఉదయ్ చందర్, యాదవరెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకులు, ఎన్ఎస్‌యూఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Must Read