అక్షరశక్తి హన్మకొండ క్రైమ్ ,పరకాల సీతారాంపూర్ ప్రధాన రహదారి పై మంగళవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచ్రవాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటన లో ఒకరు మృతి చెందగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో ముగ్గురు హసన్ పర్తి లో సెంట్రింగ్ పని చేసి తిరిగి పరకాల వైపునకు వస్తున్నారు. సమాచారం అందుకున్న పరకాల సీఐ కిషన్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగా త్రులను పోలీస్ వాహనంలోహాస్పిటల్ కి తరలించారు. మృతి చెందిన వ్యక్తి చుక్క రాజు పరకాల హరిజన వాడకు చెందినవాడిగా గుర్తించారు. గాయపడిన వారిలో చింతల సురేష్ పరిస్థితి విషమంగా ఉండగా, పోతిరెడ్డి బాబు,జంగా వంశీ కి తీవ్ర గాయాలుయ్యాయి.