Friday, September 13, 2024

చిట్యాల‌, శాయంపేట‌లో కాంగ్రెస్‌లో భారీగా చేరిక‌లు

Must Read

అక్ష‌ర‌శ‌క్తి, భూపాల‌ప‌ల్లి : భూపాలపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలోకి జోరుగా వ‌ల‌స‌లు కొన‌సాగుతున్నాయి. ఆదివారం చిట్యాల మండలం లక్ష్మీమ్ పురం తండాలో బీఆర్ఎస్ ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి ఎమ్మెల్యే అభ్య‌ర్థి గండ్ర సత్యనారాయణ రావు ఆహ్వానించారు.

అలాగే, శాయంపేట మండల కేంద్రం నుండి బుడిగ జంగాల సంఘం అధ్యక్షుడు తూర్పాటి రాజయ్య, ఎమ్మార్పీఎస్‌ మండల కార్యదర్శి మారేపల్లి ప్రకాష్‌తోపాటు, మైలారం గ్రామానికి చెందిన మాజీ ఉపసర్పంచి ఏనుగుల అశోక్, వార్డు మెంబరు నూనె ప్రకాష్, మరో 150 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సంద‌ర్భంగా కాంగ్రెస్‌లో చేరిన‌వారు మాట్లాడుతూ… ఈ అసెంబ్లీ ఎన్నికల్లో గండ్ర స‌త్తెన్న‌ను భారీ మెజారిటీతో గెలిపించుకుంటామ‌ని, ఈ 30 రోజులు సైనికుల్లా పనిచేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో చిట్యాల, శాయంపేట మండలాల అధ్యక్షులు గూట్ల తిరుపతి, దూదిపాల బుచ్చిరెడ్డి, ముఖ్య నాయకులు దూడపాక శంకర్, బుర్ర కొమురయ్య, మూల శంకర్ గౌడ్, పోలేపల్లి శ్రీనివాస్ రెడ్డి, చల్ల చక్రపాణి, దుబాసి కృష్ణమూర్తి, మారపెల్లి బుజ్జన్న తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img