- బీఆర్ఎస్‌లో చేరిన వరంగల్ సిటీ కాంగ్రెస్ కమిటీ ఆర్గనైజర్ సెక్రెటరీ ఎస్కె అలీ
అక్షరశక్తి, వరంగల్ తూర్పు : వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. బీఆర్ఎస్‌లోకి చేరికల పర్వం కొనసాగుతోంది. వరంగల్ సిటీ కాంగ్రెస్ కమిటీ ఆర్గనైజర్ సెక్రెటరీ ఎస్కే అలీ, ఆయన అనుచరులు ఏఎస్ఎం కళాశాల వద్దనున్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారందరికీ సముచిత స్థానం కల్పిస్తానని, అన్ని విధాలా అండగా ఉంటానని ఎమ్మెల్యే అన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరడానికి కృషి చేయాలని ఎమ్మెల్యే కోరారు.