అక్షరశక్తి, వరంగల్ తూర్పు : వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీలకు భారీ షాక్ తగిలింది. తాజాగా, ఆయా పార్టీలకు చెందిన కీలక నాయకులు రాజీనామా చేసి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నన్నపునేని నరేందర్ సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం రాజ్ కిషోర్, కార్పొరేటర్ కావటి కవిత రాజు యాదవ్ ఆధ్వర్యంలో గురువారం 23వ డివిజన్ కాంటెస్టడ్ కార్పొరేటర్ గుల్లపెళ్లి స్వరూప రాణి, ఆమె తనయుడు అరుణ్, 12వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిలుక శ్రీధర్, సీపీఎం సీనియర్ నాయకులు అక్కినపల్లి యాదగిరి ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అదేవిధంగా, బీఆర్ఎస్ యూత్ నాయకులు భాషకర్ల హరికృష్ణ పటేల్ ఆధ్వర్యంలో 23వ డివిజన్ బీజేపీ ఓబీసీ సెల్ అధ్యక్షుడు టింగిల్ కార్ విజయ్ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో వరంగల్ తూర్పులో గులాబీ జెండా ఎగురవేస్తామని అన్నారు. ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు.