ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య
అక్షరశక్తి, ములుగు : మేడారం జాతర విజయవంతానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య అన్నారు. మేడారం మహా జాతర నిర్వహణపై ఆదివాసీ పెద్దలు, సంఘాలతో సన్నాహక సమావేశం కలెక్టరేట్ ఆడిటోరియంలో బుధవారం నిర్వహంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేడారం జాతరలో ఆదివాసీ సంఘాలకు 22 లిక్కర్ షాపులు కేటాయించినట్లు చెప్పారు. ఆదివాసీ సంఘాల మధ్య సమన్వయం ఉండాలని అన్ని సంఘాలు జాతర విజయవంతానికి సహాయ సహకారాలు అందించాలని కోరారు.
కార్యక్రమం ప్రారంభంలో ఆదివాసీ సంఘం నాయకుల అభిప్రాయాలను వివరించాలని వారి అభిప్రాయాలను చట్టపరంగా అమలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ ఇలా త్రిపాటి, డిఆర్వో రమాదేవి, ఐటిడిఎ ఎపిఓ జె.వసంతరావు, డి టిఓ మంకి డి ఎర్రయ్య, తాడ్వాయి తహసీల్దార్ శ్రీనివాస్ పెస జిల్లా కోఆర్డినేటర్ కొమురం ప్రభాకర్ ఆదివాసి తుడుందెబ్బ నాయకులు ఐటిడిఎ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.