దేశంలో కరోనా మహమ్మారి రెచ్చిపోతోంది. కొద్దిరోజులుగా లక్షల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా.. గత 24గంటల్లో దేశవ్యాప్తంగా 2,38,018 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 310మంది కరోనాతో మృతి చెందారు. నిన్నటికంటే 20,071 కేసులు తక్కువగా నమోదు అయ్యాయి. 1,57,421మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు మొత్తం 17,36,628 యాక్టివ్ కేసులు ఉన్నాయి. పాజిటివిటీ రేట్ 14.43శాతంగా ఉంది. ఇక 8,891 ఒమిక్రాన్ కేసులు ఇప్పటివరకు నమోదు అయ్యాయి. 8.31శాతం ఒమిక్రాన్ కేసులు నిన్నటికంటే ఎక్కువగా నమోదు కావడం గమనార్హం.
Previous article
Next article
Latest News