అక్షరశక్తి, డెస్క్ : తెలంగాణలో కరోనా మహమ్మారి ఉధృతి పెరుగుతోంది. వైద్య సిబ్బందిపై పంజా విసురుతోంది. తాజాగా తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావుకూ కరోనా వైరస్ సోకింది. స్వల్ప లక్షణాలతో ఆస్పత్రితో చేరినట్లు ఆయన వెల్లడించారు. అలాగే.. గాంధీ ఆస్ప్రత్రిలో 120 మంది వైద్య సిబ్బంది వైరస్‌బారిన పడ్డారు. ఉస్మానియా పరిధిలో 159 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆదిలాబాద్ రిమ్స్‌లో 73 మంది వైద్య సిబ్బందికి కరోనా సోకింది.