- జడ్జి ముందు ప్రవేశపెట్టిన పోలీసులు
- పోలీసులు కొట్టారని విద్యార్థి నేతల వాంగ్మూలం
- మెడికల్ టెస్ట్ కోసం సుబేదారి పోలీస్ స్టేషన్‌కు తరలింపు
- వీసీ రమేశ్ ప్రోత్బలంతోనే కేయూలో అరెస్టులు!
అక్షరశక్తి, హన్మకొండ క్రైం: కాకతీయ యూనివర్సిటీకి చెందిన విద్యార్థి నేతలను పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. బుధవారం ఉదయం పోలీస్ వాహనంలో తరలించారు. జడ్జి ముందు ప్రవేశపెట్టగా పోలీసులు తమను కొట్టారని విద్యార్థి నేతలు వాంగ్మూలం ఇచ్చారు. విద్యార్థుల వాదనలు విన్న జడ్జి ఏ -1 మాచర్ల రాంబాబు, ఏ- 2 గట్టు ప్రశాంత్, ఏ-3 అరెగంటి నాగరాజు, ఏ- 4 అంబాల కిరణ్, ఏ- 5 అజయ్, ఏ- 6 శ్రీకాంత్, ఏ- 7 మధు, ఏ- 8 కమల్, ఏ-9 అంకెళ్ళ శంకర్, ఏ-10 కుమార్‌ను మెడికల్ టెస్ట్ కోసం సుబేదారి పోలీస్ స్టేషన్‌కు తరలించాలని పోలీసులను ఆదేశించారు. కాగా, విద్యార్థి నేతలను మంగళవారం పోలీసులు దౌర్జన్యంగా అరెస్ట్ చేసి రాత్రంతా స్టేషన్‌లో ఉంచి , వారిపై దాడికి దిగడం వెనుక కేయూ వీసీ రమేశ్ ప్రమేయం ఉందని పలు విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. విద్యార్థుల అరెస్టు అంశం కాకతీయ యూనివర్సిటీలో కలకలంరేపుతోంది.
అసలేం జరిగింది…
పీహెచ్‌డీ కేటగిరీ-2 అడ్మిషన్లలో అవకతవకలు జరిగాయంటూ పలు విద్యార్థి సంఘాల నేతలు ఆగ్రహం వ్య క్తం చేస్తూ మంగళవారం కేయూ ప్రిన్సిపాల్ కార్యాలయంలో శాంతియుతంగా నిరసన తెలిపిన సంగతి తె లిసిందే. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకుని నిన్న రాత్రి స్టే షన్‌కు తరలించారు. ఈసందర్భంగా తమపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారని విద్యార్థి నేతలు ఆరోపించారు. పీహెచ్‌డీ అడ్మిషన్లలో అవకతవకలు జరిగాయని, తమకు అన్యాయం జరిగిందని చె బుతున్నా వినకుండా పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారని విద్యార్థులు మండిపడ్డారు. పోలీసులు తమపై దాడి చేసి గాయపర్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పీహెచ్‌డీ కేటగిరీ-2 అడ్మిషన్ల ప్రక్రియను నిలిపివేయాలని, అర్హులందరికీ న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు.