Saturday, July 27, 2024

అరూరికి బిగ్‌ షాక్?

Must Read

– కాంగ్రెస్‌లోకి హ‌స‌న్‌ప‌ర్తి పీఏసీఎస్ చైర్మ‌న్‌?
– స‌మ‌న్వ‌య క‌మిటీ స‌మావేశానికి డుమ్మా..
– కాంగ్రెస్ నేతలతో మంతనాలు!
– నేడో రేపో చేరే అవ‌కాశాలు..

అక్షరశక్తి, హ‌స‌న్‌ప‌ర్తి : ఎన్నిక‌ల ముంగిట వ‌ర్ధ‌న్న‌పేట బీఆర్ఎస్ అభ్య‌ర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే అరూరి ర‌మేష్‌కు భారీ షాక ఇచ్చే దిశ‌గా హ‌స‌న్‌ప‌ర్తి మండ‌లానికి చెందిన కీల‌క నాయ‌కులు అడుగులు వేస్తున్న‌ట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ కీలక నేత, పీఏఏసీఎస్ చైర్మ‌న్ బిల్ల‌ ఉద‌య్‌రెడ్డితోపాటు పలువురు సీనియర్ నాయకులు, ఆయా గ్రామాలకు చెందిన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్న‌ట్లు తెలుస్తోంది. ఈ మేర‌కు వారు కాంగ్రెస్ నేత‌ల‌తోనూ మంత‌నాలు జ‌రిపిన‌ట్లు స‌మాచారం. బుధవారం హ‌స‌న్‌ప‌ర్తి ఎర్ర‌గ‌ట్టుగుట్ట‌ స‌మీపంలోని కేఎల్ఎన్ గార్డెన్లో జరిగిన 1వ డివిజ‌న్‌, 65వ డివిజ‌న్ల‌కు స‌బంధించి బీఆర్ఎస్ పార్టీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశానికి ఎమ్మెల్యే అరూరి హాజ‌ర‌య్యాయి. అయితే.. రాజీనామా చేస్తార‌నుకుంటున్న స‌ద‌రు నాయ‌కులు ఈ స‌మావేశానికి డుమ్మా కొట్ట‌డంతో ఈ ప్ర‌చారానికి బ‌లం చేకూరుతోంది. ఈ ప‌రిణామాలు వ‌ర్ధ‌న్న‌పేట బీఆర్ఎస్ పార్టీకి న‌ష్టం చేస్తాయ‌నే టాక్ బ‌లంగా వినిపిస్తోంది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img