Monday, September 9, 2024

తెలంగాణ దేశానికే దిక్సూచి

Must Read

 

అక్ష‌ర‌శ‌క్తి, గీసుగొండ : అభివృద్ధి విషయంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచిగా నిలిచిందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి రాష్ట్రం కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిందని కొనియాడారు. వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గంలోని గీసుగొండ, సంగెం మండలాల పరిధిలోని 81 మంది కళ్యాణలక్ష్మి లబ్ధిదారులకు రూ.81.00 లక్షలకుపైగా విలువ చేసే చెక్కులను ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి హన్మకొండలోని తన నివాసంలో శనివారం పంపిణీ చేశారు.

ఈసందర్భంగా ఎమ్మెల్యే ధ‌ర్మారెడ్డి మాట్లాడుతూ…. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ ప్ర‌భుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పని చేస్తున్నదని అన్నారు. ఇంటింటికీ తాగునీరు , కోటిన్నర ఎకరాలకు సాగునీరు పుష్కలంగా అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్ కే ద‌క్కింద‌న్నారు.

చేపలు, గొర్రెలు, కోళ్ళు, బర్రెల పెంపకం పెరిగిందన్నారు. వెయ్యి గురుకులాల ద్వారా ఇంగ్లీష్‌ మీడియంలో నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యను ఉచితంగా ప్రభుత్వం అందజేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఐటీ, ఫార్మా, ఇంజినీరింగ్‌, ఏరోస్పేస్‌ రంగాలు మరింత దూసుకుపోతున్నాయని తెలిపారు. ఒకే దేశంలో వేర్వేరు విధాలుగా కేంద్రం ధాన్యం కొనుగోలు చేయడం సిగ్గుచేటని, పంజాబ్ తరహాలోనే తెలంగాణ రైతన్నలు పండించిన ధాన్యాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఆయ‌న డిమాండ్ చేశారు. రైతులను గోసపెడితే బీజేపీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పక తప్పదని ధ‌ర్మారెడ్డి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల, గ్రామస్థాయి ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img