గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కి ఊహించని దెబ్బ తగిలింది. భారతీయ జనతా పార్టీ ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించకూడదో పది రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని బీజేపీ హైకమాండ్ స్పష్టం చేసింది. రాజాసింగ్ విడుదల చేసిన వీడియోపై బీజేపీ అధిష్టానం సీరియస్ అయింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఇప్పటికే రాజీసింగ్ పై కేసులు నమోదువుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజాసింగ్ వ్యవహారశైలిపై ఆరా తీసిన హైకమాండ్ పార్టీకి డ్యామేజీ కలగకుండా క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాంగా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. సెప్టెంబర్ 2వ తేదీలోగా వివరణ ఇవ్వాలని రాజాసింగ్ ను ఆదేశించింది.