- సామాజిక సేవలో బీజేపీ యువనేత రాణాప్రతాప్
- లాక్‌డౌన్‌లో 900కుటుంబాలకు నిత్యావసర సరుకులు
- పేదింటి ఆడబిడ్డల వివాహాలకు పెద్దన్నగా..
- పేదల వైద్యం, పిల్లల గుండె ఆపరేషన్లకు సాయం
- వడగండ్లతో సర్వం కోల్పోయిన రైతులకు భరోసా
- నర్సంపేటలో ఆపద్బాంధవుడిలా గుర్తింపు
- నియోజకవర్గంలో విస్తృత పర్యటనలు
అక్షరశక్తి, నర్సంపేట రూరల్ : నర్సంపేట నియోజకవర్గంలో బీజేపీ యువనేత రాణాప్రతాప్ సామాజిక సేవలో ముందువరుసలో ఉంటున్నారు. కులమతాలకు అతీతంగా, రాజకీయాలతో సంబంధం లేకుండా ఎక్కడ.. ఎవరికి ఆపద వచ్చినా.. నేనున్నానంటూ ముందుకొచ్చి ఆదుకుంటున్నారు. అన్నివర్గాల ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ ముందుకుసాగుతున్న రాణాప్రతాప్.. నియోజకవర్గంలో ఆపద్బాంధవుడిలా గుర్తింపు పొందుతున్నారు. వడగండ్ల వానతో సర్వం కోల్పోయిన రైతులకు అండగా నిలిచారు. వ్యవసాయ కుటుంబం నుంచి ఎంబీబీఎస్ డాక్టర్‌గా ఎదిగిన రాణాప్రతాప్.. పేదల ఆస్పత్రి ఖర్చులకు, పిల్లల గుండె ఆపరేషన్లకు ఆర్థిక సాయం అందిస్తూ మనసున్న మారాజుగా గుర్తింపు పొందారు. పేదింటి ఆడబిడ్డ పెళ్లికి సాయం చేసి పెద్దన్నగా నిలిచారు. ఇటీవల కురిసిన ఎడతెరపిలేని వర్షంలోనూ గ్రామాల్లో పర్యటించి, బాధితులకు భరోసా ఇచ్చారు. పరదాలు, నిత్యావసర సరుకులు అందించారు. మరోవైపు నియోజకవర్గంలో బీజేపీ బలోపేతానికి కృషి చేస్తున్నారు.
నియోజకవర్గంలో ఆపద్భాంధవుడు
కరోనా లాక్‌డౌన్ సమయంలో నర్సంపేట నియోజకవర్గ ప్రజలకు భరోసాగా నిలిచారు. సుమారు 70 గ్రామాల్లో లక్షా పదివేల మాస్కులు పంపిణీ చేశారు. నర్సంపేటతోపాటు చుట్టుపక్కల గ్రామాల్లో సుమారు 900కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేశారు. వైద్య సాయంలోనూ రాణాప్రతాప్ నిత్యం పేదలకు అందుబాటులో ఉంటున్నారు. ఆస్పత్రుల్లో వైద్యఖర్చులు, ప్రధానంగా పిల్లల గుండె ఆపరేషన్ల విషయంలో అండగా నిలిచారు. అంతేగాకుండా,పేద అమ్మాయిల వివాహాలకు తనవంతు సాయం అందజేస్తున్నారు. ఆరు నెలల క్రితం కురిసిన వడగండ్ల వర్షానికి సర్వం కోల్పోయిన నర్సంపేట, నల్లబెల్లి, దుగ్గొండి మండలాల్లో రాణాప్రతాప్ విస్తృతంగా పర్యటించారు. రైతులకు నిత్యావసర సరుకులు అందించి, ధైర్యం చెప్పారు. నల్లబెల్లి మండలంలో జరిగిన అగ్నిప్రమాదంలో ఇండ్లు కోల్పోయిన వారికి సాయం చేశారు. అంతేగాకుండా, ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల నర్సంపేట నియోజకవర్గంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎడతెరపిలేకుండా కురిసిన వర్షాల్లోనూ రాణాప్రతాప్ గ్రామాల్లో పర్యటించారు. ఇండ్లు కోల్పోయిన వారికి, వరదలతో ఇబ్బందులు పడిన వారికి పరదాలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేసి భరోసా ఇచ్చారు.
సన్మార్గం వైపు యువత…
నర్సంపేట నియోజకవర్గంలోని యువతను సన్మార్గంలో నడిపించేందుకు రాణాప్రతాప్ కృషి చేస్తున్నారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండేలా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇష్టమైన రంగాల్లో రాణించేందుకు ప్రోత్సాహం అందిస్తున్నారు. ప్రధానంగా యువత క్రీడారంగంలో రాణించేందుకు స్పోర్ట్స్ కిట్స్ అందజేస్తున్నారు. యువతతో రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నారు. అంతేగాకుండా, నర్సంపేటలో ప్రతీ ఏడాది డిసెంబర్ 8న అత్యంత వైభవంగా అయ్యప్పస్వామి పల్లివేట కార్యక్రమాన్ని నిర్వహించడంలో రాణాప్రతాప్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సందర్భంగా వేలాదిమందికి అన్నదానం చేస్తున్నారు. మరోవైపు నర్సంపేట నియోజకవర్గంలో బీజేపీ బలోపేతానికి రాణాప్రతాప్ కృషి చేస్తున్నారు. విస్తృతమైన పర్యటనలతో యువతతోపాటు అన్నివర్గాల ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.