సీపీఐ హనుమకొండ జిల్లా కార్యదర్శి కర్రే బిక్షపతి
అక్షరశక్తి, హన్మకొండ : శ్రామికవర్గ పితామహుడు, సమసమాజ స్వాప్నికుడు కార్ల్ మార్క్స్ అని సీపీఐ హనుమకొండ జిల్లా కార్యదర్శి కర్రే బిక్షపతి అన్నారు. దోపిడీ రహిత సమాజం ఏర్పాటుకు కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు ప్రజలను చైతన్య పరచాలి అన్నారు. కార్ల్ మార్క్స్ జయంతి సందర్భంగా బాలసముద్రంలోని సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కర్రే బిక్షపతి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉన్నత కుటుంబంలో పుట్టిన కారల్ మార్క్స్ దోపిడీ దారులకు వ్యతిరేకంగా, కార్మిక హక్కుల సాధన కోసం నిరంతరం పరితపించారన్నారు. కమునిస్ట్ ప్రణాళిక పెట్టుబడి గ్రంధాలను తీసుకురావడానికి తన మిత్రుడు ఎంగేల్స్ సహకారంతో రోజుకు 18 గంటల చొప్పున 30 సంవత్సరాలపాటు కష్టపడ్డారన్నారు. ఈక్రమంలోనే భార్య పిల్లలతో అర్థాకలితో కటిక దారిద్రం జీవనం కొనసాగించిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. ప్రపంచ మేధావి మార్క్స్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకు పోవాల్సిన బాధ్యత పార్టీ ప్రజాసంఘాలపై ఉన్నదని, కార్ల్ మార్క్స్ సిద్ధాంత ఆశయాల కోసం నిరంతరం ఉద్యమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పోతరాజు సారయ్య, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నేదునూరి జ్యోతి, జిల్లా సహాయ కార్యదర్శి తోట బిక్షపతి, జిల్లా కార్యవర్గ సభ్యుడు మండ సదాలక్ష్మి, ఉట్కూరు రాములు, మద్దెల ఎల్లేష్, కర్రే లక్ష్మణ్, నరసయ్య, బిక్షపతి, సంతోష్,
వేల్పుల ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు.