Tuesday, September 10, 2024

భూపాలపల్లిలో మంత్రుల పర్యటన సక్సెస్

Must Read

– నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం
– మైలారం ఇండస్ట్రియల్ పార్కు శంకుస్థాపన
– సభకు భారీగా తరలివచ్చిన జనం
– భూపాలపల్లి యువతకు ఇండస్ట్రీస్‌తో భారీగా ఉద్యోగ అవకాశాలు
– తెలంగాణలో ప్రజలందరి దీవెనలతో ఇందిరమ్మ రాజ్యం వచ్చింది
– ప్రజలకు ఇచ్చిన అన్ని వాగ్దానాలను అమలు చేస్తాం..
– సభలో మంత్రులు దుద్దిళ్ల‌ శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క

అక్ష‌ర‌శ‌క్తి, భూపాలపల్లి: భూపాలపల్లి నియోజకవర్గంలో శనివారం మంత్రులు దుద్దిళ్ల‌ శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, వరంగల్ ఎంపీ కడియం కావ్య, టిజిఐఐసి రాష్ట్ర చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ ఐత ప్రకాష్ రెడ్డి ఇతర ముఖ్య నేతల పర్యటన సక్సెస్ అయింది. భూపాలపల్లి నియోజకవర్గంలోని గణపుర మండలం మైలారం గ్రామ శివార్లలో సుమారు 60 ఎకరాల విస్తీర్ణంలో ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి పనులకు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిలుగా మంత్రులు పాల్గొన్నారు.
ముందుగా చెల్పూర్ జెన్కో క్వార్టర్స్ లోని హెలీ ప్యాడ్ వద్ద ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్, ఎస్పీ మంత్రులకు శాలువాలు కప్పి, బొకేలు ఇచ్చి ఘన స్వాగతం పలికారు. అనంతరం మైలారం గ్రామ శివారులోని గుట్టలకు చేరుకుని అక్కడ ఏర్పాటుచేసిన ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి పనులకు మంత్రి శ్రీధర్ బాబుతో పాటు ఇతర మంత్రులు శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రులు మాట్లాడుతూ… భూపాలపల్లి యువతకు ఇక్కడ ఏర్పాటు కాబోయే ఇండస్ట్రియల్ పార్కుతో చాలామంది నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అన్నారు. యువతకు స్కిల్ ఇండియా ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలను చూపించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అందులో భాగంగా ప్రభుత్వం యువతకు జాబ్ క్యాలెండర్ను తీసుకొచ్చిందని గుర్తు చేశారు.
తెలంగాణ ప్రజలందరి దీవెనలతో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా పాలన కొనసాగుతుందని అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ తప్పక అమలు చేస్తున్నట్లు తెలిపారు. భూపాలపల్లి, ములుగు నియోజకవర్గాలకు సాగునీటి అవసరాలను తీర్చడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని, త్వరలోనే ఇరిగేషన్ మంత్రితో మాట్లాడి డిపిఆర్ తయారు చేస్తామని అన్నారు.
అనంతరం భూపాలపల్లి పట్టణంలోని వంద పడకల ఆసుపత్రిలో నూతనంగా నిర్మించిన డ్రగ్స్ స్టోరేజ్ రూమును మరియు డాక్టర్స్ క్యాంటీన్ మంత్రులు ప్రారంభించారు. అనంతరం అక్కడి నుండి బయలుదేరి కలెక్టరేట్ లోని ఐడిఓసి సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన అన్ని శాఖల అధికారులతో జిల్లా స్థాయి సమీక్షా సమావేశంలో మంత్రులు పాల్గొన్నారు. జిల్లాస్థాయి అధికారులు అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ జిల్లాను అగ్రస్థానంలో నిలపాలని మంత్రులు అధికారులకు సూచనలు చేశారు. అనంతరం కలెక్టరేట్ లోని మంత్రుల ఛాంబర్ లో లంచ్ చేసి చెల్పూర్ జెన్కో క్వార్టర్స్ లోని హెలీ ప్యాడ్ కు చేరుకుని అక్కడి నుండి హైదరాబాద్ కు మంత్రులు తిరుగు ప్రయాణం అయ్యారు. కాగా, మంత్రులకు ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు దగ్గర ఉండి సెండ్ ఆఫ్ ఇచ్చారు. మంత్రుల పర్యటన విజయవంతం అవ్వడంతో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రజాప్రతినిధులకు, అన్ని శాఖల అధికారులకు, నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, నియోజకవర్గ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img