అక్షరశక్తి, హైదరాబాద్ : సూపర్ స్టార్ మహేశ్ బాబు, మహానటి కీర్తి సురేష్ లు నటించిన తాజా చిత్రం సర్కారు వారి పాట. ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో విలన్‌గా సముద్ర ఖని అలరించనున్నారు. ఈ నెల 12న ఈ మూవీ విడుదల కానుంది. దీంతో సినిమా ప్రమోషన్స్‌లో స్పీడు పెంచిన చిత్ర యూనిట్ మే 2న ట్రైలర్ విడుదల చేసింది. ప్రస్తుతం ఈ ట్రైలర్ యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. ఈ ట్రైలర్ 19 గంటల్లో అంటే 24 గంటలు గడవక ముందే 25 మిలియన్ వ్యూస్‌ను క్రాస్ చేసింది. ఈ వ్యూస్‌తోపాటు ఒక మిలియన్ లైక్స్ సాధించింది. ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్‌లో నెంబర్ వన్ స్థానంలో ట్రెండ్ అవుతోంది. ఇప్పుడే ఇన్ని లైక్స్, వ్యూస్ సాధించిన ఈ చిత్రం 24 గంటలు గడిస్తే మరెన్ని రికార్డులు సొంతం చేసుకుంటుందో వేచి చూడాలి.
Previous article
Next article
Latest News