Tuesday, June 18, 2024

ములుగు ఎమ్మెల్యే సీత‌క్క అరెస్ట్‌

Must Read

అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్‌: ములుగు ఎమ్మెల్యే సీత‌క్క‌ను హైద‌రాబాద్‌లో పోలీసులు అరెస్ట్ చేసి, నాంప‌ల్లి స్టేష‌న్‌కు త‌ర‌లించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల స్థానికత‌కు సంబంధించి తెలంగాణ ప్ర‌భుత్వం ఇటీవ‌ల 317 జీవోను తీసుకొచ్చింది. రాష్ట్ర‌ప‌తి ఉత్త‌ర్వుల‌కు ఈ జీవో వ్య‌తిరేక‌మ‌ని, ఉద్యోగుల పాలిట మ‌ర‌ణ‌శాస‌నంగా మారింద‌ని, ప్ర‌భుత్వం 317 జీవోను వెంట‌నే వెన‌క్కితీసుకోవాల‌ని కాంగ్రెస్‌పార్టీ ఆధ్వ‌ర్యంలో బుధ‌వారం ట్యాంక్‌బండ్‌పై పెద్ద ఎత్తున నిర‌స‌న తెలిపారు.

ఈ సంద‌ర్భంగా ములుగు ఎమ్మెల్యే సీత‌క్క‌తోపాటుగా ఎన్ ఎస్‌యూఐ రాష్ట్ర అధ్య‌క్షుడు బ‌ల్మూరి వెంక‌ట్‌, ప‌లువురు కాంగ్రెస్‌నేత‌ల‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈసంద‌ర్భంగా సీత‌క్క మాట్లాడుతూ.. ప్ర‌భుత్వం తీసుకొచ్చిన 317 జీవోతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నార‌ని అన్నారు. అరెస్ట్‌లు, నిర్బంధాల‌తో పోలీసులు మ‌మ్మ‌ల్ని అడ్డుకోలేర‌ని, 317 జీవోను ప్ర‌భుత్వం వెన‌క్కి తీసుకునే వర‌కూ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంద‌ని ఆమె అన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img