అక్షరశక్తి, వరంగల్ : వరంగల్ మహానగరంలో ప్రధాన మంత్రి నరేంద్రమోడీ శనివారం పర్యటించారు.
వరంగల్ పర్యటన భాగంగా హెలికాఫ్టర్ లో మామూనూర్ హెలిపాడ్‌కు చేరుకున్న భారత ప్రధాని నరేంద్ర మోడీకి హన్మకొండ, వరంగల్ జిల్లా కలెక్టర్లు సిక్తాపట్నాయక్, ప్రావీణ్య, వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ స్వాగతం పలికారు. అనంతరం ప్రధానమంత్రి మంత్రి నరేంద్రమోదీ 10.36గంటలకు భద్రకాళి దేవాలయం ఆవరణకు చేరుకున్నారు.
ఆలయ అర్చకులు అధికారులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికినారు. ముందుగా ఆలయ ఆవరణలోని గోశాలనందు గో సేవలో పాల్గొని గోవులకు గ్రాసాన్ని తినిపించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలకు చేరుకుని విజయసంకల్ప బహిరంగ సభలో పాల్గొన్నారు.