అక్షరశక్తి, హన్మకొండ : హన్మకొండలో నిర్వహించిన రైతు సంఘర్షణ సభలో వరంగల్ డిక్లరేషన్ పేరుతో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సంచలన ప్రకటన చేశారు. రైతులకు సంబంధించి కీలక తీర్మానాలు ప్రకటించారు. 365 రోజుల్లో కాంగ్రెస్ ఫార్టీ అధికారంలోకి వచ్చి తీరుతుందని సోనియమ్మ రాష్ట్రం తప్పకుండా వస్తుందని తెలిపారు. సోనియమ్మ రాష్ట్రం వచ్చిన తర్వాల రైతులకు రెండులక్షల రుణమాఫి ఏకకాలంలో చేస్తామని ప్రతీ ఎకరాకు ఏడాదికి రూ.15వేల పంట సాయం అందిస్తామన్నారు. రైతులు పండించిన పంటలకు మెరుగైన గిట్టుబాటు ధరతో కొనుగోలు చేస్తుంది. తెలంగాణలో మూతపడిన చెరుకు కర్మాగారాలను తెరిపిస్తామని హామీ ఇచ్చారు. రైతులపై భారం లేకుండా మెరుగైన పంటల బీమా పంటలను తీసుకొచ్చి నష్టాన్ని అంచనా వేయించి నష్టపరిహారం అందేలా చర్యలు చేపడుతామన్నారు. రైతు బీమా పథకం, పోడుభూముల్లో వ్యవసాయం చేసుకుంటున్న ఆదివాసీ బిడ్డలకు యాజమాన్య హక్కు పత్రాలు ఇస్తామన్నారు. అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు కల్పిస్తాం. ధరణి పోర్టల్ రద్దు చేస్తాం. నకిలీ విత్తనాలు, నకిలీ పురుగుమందుల కట్టడికి చర్యలు తీసుకుని, రైతులకు సాయం చేస్తాం. పెండింగ్ ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేస్తాం. రైతుల సమస్యల పరిష్కారం కోసం, చట్టపరమైన హక్కులతో రైతు కమిషన్ ఏర్పాటు చేస్తాం. వ్యవసాయం పండుగ చేస్తామని చెప్పారు. వరి ధాన్యానికి కనీస మద్దతు ధర 2500కు క్వింటాల్ వడ్లు, మొక్కజొన్న క్వింటాల్ రూ.2200కు మొక్కజొన్న, పత్తిని రూ.6500కు, మిర్చిని రూ. 15వేలకు కొనుగోలు చేస్తాం. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని తెలిపారు. పసుపు రూ.12వేలకు కొనుగోలు చేస్తామని ఎర్రజొన్న రూ.3500కు కొనుగోలు చేస్తామని తెలిపారు.