Monday, June 17, 2024

నాది ప‌క్కా ప్లాన్ !

Must Read

స్కెచ్ వేస్తే తిరుగుండ‌దు
సౌదీలో ప‌నిచేసిన అనుభ‌వమే కెరీర్‌లో ఉప‌యోగ‌ప‌డింది
ఆర్కిటెక్ట్‌గా తెలుగు రాష్టాల్లో ప్ర‌త్యేక గుర్తింపు హ‌ర్ష‌ణీయం
గుళ్లు, మ‌సీదులు, చ‌ర్చ్‌ల నిర్మాణాల్లో భాగ‌స్వామ్యం కావ‌డం అదృష్టం
వాస్తు నిపుణుడిగా, ఎక్స్‌టీరియర్ డిజైన‌ర్‌గా ఖ్యాతి ద‌క్క‌డం గ‌ర్వ‌కార‌ణం
సాజిద్ అసోసియేట్స్ చీఫ్ క‌న్స‌ల్టెంట్ ఎంఏ సాజిద్‌


నాది వాస్తు ప‌ర్ఫెక్ట్ ఆర్కిటెక్చ‌ర్ ప్లాన్‌.. ఒక్క‌సారి డిజైన్ చేశానంటే ఇక తిరుగుండ‌దు. గుడి, మ‌సీదు, చ‌ర్చి, ఇల్లు, పాఠ‌శాల‌, క‌ళాశాలతోపాటు డూప్లెక్స్ బిల్డింగ్స్‌, ఫంక్ష‌న్ హాళ్లు, అపార్ట్‌మెంట్లు, షాపింగ్ కాంప్లెక్సులు,
ఇలా.. ఏ భ‌వ‌న‌మైనా, ఏ కార్యాల‌య‌మైనా అందంగా ముస్తాబ‌వ్వాలంటే నా ముద్ర ప‌డాల్సిందే.. వాస్తుపై నాకున్న ప‌ట్టు.. నిర్మాణ‌రంగంలో ఉన్న అపార అనుభవ‌మే న‌న్ను ఈ స్థాయిలో నిల‌బెట్టింది. ఆర్కిటెక్చ‌ర్ వాస్తు, ప్లానింగ్ నిపుణుడిగానే కాకుండా ఎక్స్‌టీరియర్ డిజైన‌ర్‌గా కూడా ప్ర‌త్యేక ప్ర‌త్యేక గుర్తింపు ద‌క్కేందుకు దోహ‌ద‌ప‌డింది. చిరుద్యోగిగా సౌదీలో నేర్చుకున్న పాఠాలే ఈ రోజు కెరీర్‌లో ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతున్నాయి. ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలోనే కాదు.. ఇటు తెలంగాణ అటు ఏపీల్లోనూ నా డిజైన్ల‌ని కోరుకునేవారు అనేక‌మంది ఉన్నారు. వారంద‌రికీ సాజిద్ భాయ్ అంటే న‌మ్మ‌కం.. ఆ న‌మ్మ‌క‌మే చిరుద్యోగిగా కేరీర్ ప్రారంభించిన న‌న్ను ఈ రోజు సాజిద్ అసోసియేట్స్ కంపెనీ స్థాపించే వ‌ర‌కు తీసుకెళ్లింది. ఇక్క‌డ రాణించాలంటే రోజురోజుకూ నైపుణ్యాల‌కు ప‌దునుపెట్టాల్సిందే.. ఈ రంగంలోకి రావాల‌నుకునేవారికి చెప్పేదొక్క‌టే… క‌ష్ట‌ప‌డేత‌త్వం ఉంటేనే రండి అంటున్నారు సాజిద్ అసోసియేట్స్ చీఫ్ క‌న్స‌ల్టెంట్ ఎంఏ సాజిత్‌. అక్ష‌ర‌శ‌క్తి ఆయ‌న ఆయ‌న ప్ర‌త్యేకంగా మాట్లాడారు.

ప్ర‌శ్న : బాల్యం, కుటుంబ నేప‌థ్యం..? జ‌వాబు : మాది వ‌రంగల్ న‌గ‌రంలోని దేశాయ్‌పేట‌. ఎంఏ వ‌హీద్‌, బిలికిస్ బేగం మా అమ్మానాన్న‌. అమ్మ గృహిణి కాగా నాన్న స్టేష‌న్ మాస్టర్‌. మేం మొత్తం ఐదుగురు అన్న‌ద‌మ్ములం. నేను మూడోవాడిని. పెద్ద‌న్న‌య్య సివిల్ ఇంజినీర్‌, రెండో అన్న ఫార్మాలో మేనేజ‌ర్‌, సౌదీలో త‌మ్ముడు అకౌంటెంట్‌గా, ఇంకో త‌మ్ముడు ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. నాన్న మ‌మ్మ‌ల్ని ఎంతో క‌ష్ట‌ప‌డి చ‌దివించారు.

ప్ర‌శ్న : మీ విద్యాభ్యాసం, కెరియ‌ర్ గురించి చెప్పండి.. ? జ‌వాబు : వ‌రంగ‌ల్ దేశాయ్‌పేట‌లోని నెహ్రూ మెమోరియ‌ల్ హైస్కూల్లో (1985-86)లో ప‌దో త‌ర‌గ‌తి పూర్తిచేశా. 1990లో సివిల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా చేశాను. 2003లో పార్ట్‌టైం జాబ్ చేస్తూ, బీటెక్ సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేశా. ముందునుంచి ఆర్కిటెక్చ‌ర్‌పై మోజు ఉండ‌టం వ‌ల్ల వ‌రంగ‌ల్‌, హైద‌రాబాద్‌, సౌదీలో ఆర్కిటెక్ ద‌గ్గ‌ర అసిస్టెంట్ ఆర్కిటెక్ట్‌, డిజైన‌ర్‌గా ప‌నిచేయ‌డం మొద‌ల‌పెట్టాను. నేను ప‌నిచేసిన అగ్ర ఆర్కిటెక్ట్ సంస్థ‌లో ప్లానింగ్‌, డిజైనింగ్‌కు సంబంధించి అనేక మొళ‌కువ‌లు నేర్చుకున్నా. 1995-96 మ‌ధ్య కాలంలో హ‌న్మ‌కొండ‌లోని ర‌ణ‌దేవ్ ఆర్కిటెక్స్ వ‌ద్ద విధులు నిర్వ‌హించా. సౌదీలో అసిస్టెంట్ ఆర్కిటెక్ట్‌గా ఆడిటోరియం, హోట‌ల్స్‌, డీల‌క్స్ విల్లాస్ కు ప‌నిచేయ‌డం మ‌రిచిపోలేని అనుభూతినిచ్చింది. నాగార్జున క‌న్స్ర‌క్ష‌న్ కంపెనీలో ప్రాజెక్ట్ ఇంజినీర్‌గా మైసూర్‌లో విధులు నిర్వ‌హించా. ఇక స్వంతంగా స్థిర‌ప‌డాల‌నే ఉద్దేశంతో 2000ల సంవ‌త్స‌రంలో వ‌రంగ‌ల్‌లోనే సాజీద్ అసోసియేట్స్‌ను ప్రారంభించా.

ప్ర‌శ్న : మీకు సంతృప్తినిచ్చిన, గుర్తింపు తెచ్చిన ప్రాజెక్టులేమైనా ఉన్నాయా..? జ‌వాబు : చాలా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అనేక‌మంది అధికారుల‌తోపాటు ఆల‌య అర్చ‌కులు వాస్తుప‌ర‌మైన అంశాల‌పై న‌న్ను సంప్ర‌దిస్తుంటారు. ఆల‌యాల పున‌ర్నిర్మాణాల్లో, అధికారుల ఆఫీస్‌ల ఏర్పాటులో వాస్తు కీల‌కంగా భావించి న‌న్ను సంప్ర‌దించ‌డం సంతోషాన్ని క‌లిగిస్తోంది. నాకు సంతృప్తినిచ్చిన ప్రాజెక్టులు ఎన్నో ఉన్నాయి. వాటిలో కొన్ని…
1. రామ‌న్న‌పేట‌లో చ‌ర్చి డిజైనింగ్‌
2. ట్రినిటీ బాపిస్ట్ చ‌ర్చి ఎలివేష‌న్‌
3. విద్యానిల‌య హ‌స్కూల్ ఆర్కిటెక్ డిజైన్‌
4. న‌ర్సంపేట‌లో విజ్‌డ‌మ్ హైస్కూల్‌
5. ల్యాదెల్ల‌లో వికాస్ హైస్కూల్ డిజైనింగ్‌
6. హైద‌రాబాద్‌, జ‌న‌గాం, ఖ‌మ్మం, తొర్రూరు, కేసముద్రంలో అనేక ప్రాజెక్టులు చేప‌ట్టాం.
7. ట్రైసిటీలో ప్రాజెక్టులు, ఎక్స్‌టీరియ‌ల్ డిజైన్ల‌తోపాటు అనేక డుప్లెక్స్‌ల నిర్మాణాలు.

ప్ర‌శ్న : మీ కెరియ‌ర్‌లో డ్రీమ్ ప్రాజెక్టులు ఏమైనా చేశారా..?
జ‌వాబు : అనేక ప్రాజెక్టులు చేశా.. కెరియ‌ర్‌లో మీలాగ‌ డ్రీమ్ ప్రాజెక్టులు మ‌రెవ‌రూ చేయ‌లేర‌ని కొంద‌రు స‌న్నిహితులు అంటుంటే చాలా ఆనందంగా ఉంటుంది. ఇంత‌కంటే గొప్ప అచీవ్‌మెంట్ ఇంకేముంటుంది. తెలంగాణ‌తోపాటు ఏపీ నుంచి అనేక మంది మీ వాస్తు నైపుణ్యం బాగుంద‌ని మెచ్చుకుంటుంటే చాలా ప్రైడ్ గా ఫీల్ అవుతుంటా.

ప్ర‌శ్న : మీ వ్యాపారానికి సాంకేతిక‌ను ఎలా ఉప‌యోగించుకుంటారు..?
జ‌వాబు : నాకు సోష‌ల్‌మీడియా ద్వారా మంచి గుర్తింపు ల‌భించింది. సాజిద్ అసోసియేట్స్ కు మంచి రేటింగ్ రావ‌డం సంతోషం క‌లిగించింది. sajidassociates.com పేరుతో సొంత వెబ్‌సైట్, జ‌స్ట్ డ‌య‌ల్‌, గూగుల్ , ఫేస్‌బుక్‌, ట్విట్ట‌ర్‌, ఇన్‌స్టాగ్రామ్‌తో బిజినెస్ లిస్టింగ్ ఉండ‌టం వ‌ల్ల ప్ర‌పంచంలోని ఏ మూల‌నున్న వ్య‌క్తులైన న‌న్ను సంప్ర‌దిస్తున్నారు. వారికి ఆన్‌లైన్ ప్లానింగ్ , డిజైనింగ్ సేవ‌లు అందిస్తున్నాను.

ప్ర‌శ్న : వృత్తిప‌రంగా బిజీగా ఉండే మీకు ఇత‌ర వ్యాప‌కాలేమైనా ఉన్నాయా..?
జ‌వాబు : కెరియ‌ర్ ప‌రంగా బిజీగా ఉన్న‌ప్ప‌టికీ.. స‌మ‌యం దొరికిన‌ప్పుడు లాంగ్ డ్రైవ్‌కు వెళ్ల‌డం, ట్రావెలింగ్ చేయ‌డానికి ఇష్ట‌ప‌డ‌తా.. దూర ప్రాంతాల‌కు వెళ్ల‌డం కొత్త‌కొత్త నిర్మాణాలు, డిజైన్స్ కొర‌కు విదేశాల‌ను సంద‌ర్శించ‌డం హాబీగా మారిపోయింది. ఈ క్ర‌మంలోనే స్టిట్జ‌ర్లాండ్‌, డెన్మార్క్‌, బెల్జియం, జ‌ర్మ‌నీ, నార్వే, బాలీ, థాయ్‌లాండ్‌, స్వీడ‌న్‌, నెద‌ర్లాండ్స్‌, మ‌లేషియా, సింగ‌పూర్‌, మాల్దీవులు, ఇండోనేషియాకు వెళ్లా..

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img