Saturday, July 27, 2024

స‌త్త‌న్నే.. ఒత్త‌డు!

Must Read
  • గండ్ర గెలుపు ఖాయమే.. మెజారిటీనే చూసుకోవాలి!
  • భూపాల‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో ఆస‌క్తిరేపుతున్న ప‌బ్లిక్ ఒపీనియ‌న్‌
  • కాంగ్రెస్ అభ్య‌ర్థి గండ్ర స‌త్య‌నారాయ‌ణ రావు
    విజ‌యం ఖాయ‌మంటూ ఊరూరా పెద్దఎత్తున ప్ర‌చారం
  • అధికార పార్టీని హ‌డ‌లెత్తిస్తున్న మౌత్ టాక్
  • ఎన్నిక‌ల నాటికి కాంగ్రెస్ గ్రాఫ్
    మ‌రింత పెరుగొచ్చు అంటున్న విశ్లేష‌కులు
  • తాజా ప‌రిణామాల‌తో ఎమ్మెల్యే వెంక‌ట ర‌మ‌ణారెడ్డి ఉక్కిరిబిక్కిరి
  • ఎప్ప‌టిలాగే పోల్ మేనేజ్‌మెంట్‌పైనే భారం..?

అక్ష‌ర‌శ‌క్తి, భూపాల‌ప‌ల్లి: ఈసారి స‌త్త‌న్నే.. ఒత్త‌డు.. గండ్ర గెలుపు ఎప్పుడో ఖాయమైంది.. మెజారిటీ ఎంత‌న్న‌దే తేలాలె.. ఇది భూపాలప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో ఏ మూల‌కెళ్లినా, న‌లుగురు ఓచోట క‌లిసినా వినిపిస్తున్న మాట‌. ఆ మండలం, ఈ మండ‌లం తేడాలేదు. ఆపార్టీ, ఈపార్టీ బేధంలేదు. ఆడామ‌గా, ముస‌లిముత‌క వ్య‌త్యాసం లేదు. అంద‌రి నోటా ఒక్క‌టే మాట‌.. గండ్ర సత్తెన్న గెలుస్తాండు.. ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో కీల‌క‌మైన భూపాల‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో ప‌బ్లిక్ ఒపీనియ‌న్ ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. గ‌తంలో ఎన్న‌డూలేని విధంగా ఈసారి కాంగ్రెస్ అభ్య‌ర్థి గండ్ర స‌త్య‌నారాయ‌ణ విజ‌యం ఖాయమంటూ మౌత్ టాక్ పెద్దఎత్తున ప్ర‌చారం అవుతోంది. ఆఖ‌రికి అధికార బీఆర్ఎస్‌, బీజేపీ పార్టీల నాయ‌కులు, కిందిస్థాయి కార్య‌క‌ర్త‌ల్లో సైతం అంత‌ర్గ‌తంగా ఇదే అభిప్రాయం వ్య‌క్తం అవుతుండ‌టం కాంగ్రెస్ వేవ్‌కు అద్దం ప‌డుతోంది. ప‌ట్ట‌ణంతోపాటు మారుమూల ప‌ల్లెల్లోనూ ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓ అవ‌కాశం ఇద్దామ‌నే టాక్ బ‌లంగా వినిపిస్తోంది. వ‌రుస‌గా రెండుసార్లు ఓడినా జ‌నంమ‌ధ్యే ఉంటున్న గండ్ర స‌త్త‌న్న‌ను గెలిపించుకుందామ‌ని ప్ర‌జ‌లు చ‌ర్చించుకోవ‌డ‌మే క‌నిపిస్తోంది. ఈ మౌత్‌టాక్ అధికార బీఆర్ఎస్ పార్టీని హ‌డ‌లెత్తిస్తోంది. ఎమ్మెల్యే గండ్ర వెంక‌ట ర‌మ‌ణారెడ్డి గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తిస్తోంది. ఇప్ప‌టికే భూపాల‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో కాంగ్రెస్ గాలి బ‌లంగా వీస్తోంద‌ని, ఎన్నిక‌ల నాటికి పార్టీ గ్రాఫ్ మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు.

పోల్ మేనేజ్‌మెంట్ క‌ష్ట‌మే !

భూపాల‌ప‌ల్లి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్య‌ర్థి గండ్ర వెంక‌ట ర‌మ‌ణారెడ్డి పోల్ మేజేజ్‌మెంట్‌లో దిట్ట అయిన ప్ప‌టికీ ఈసారి ప‌రిస్థితులు అనుకూలంగా లేవు. త‌న‌కున్న ధ‌న‌బ‌లంతో ప్ర‌జాబ‌లాన్ని రాత్రికిరాత్రే తారుమారు చేయొచ్చ‌న్న ధీమా కూడా వ‌ర్క‌వుట్ అయ్యే ఛాన్స్‌లేదు. 2009, 2018 ఎన్నిక‌ల్లోనూ పోల్ మేజేజ్‌మెంట్‌ను అమ‌లు చేయ‌డం వ‌ల్లే గెలుపొందిన గండ్రకు ఈ ఎన్నిక‌లు మాత్రం ప్ర‌తికూలంగా మారుతున్నాయి. బీఆర్ఎస్ గ్రాఫ్ అమాంతప‌డిపోతుండ‌టం, రాష్ట్ర‌వ్యాప్తంగా కాంగ్రెస్ గాలి బ‌లంగా వీస్తుండ‌టంతో ఇక చివ‌రి అస్త్రంగా గండ్ర మ‌ళ్లీ త‌న‌కు అచ్చొచ్చిన పోల్ మేనేజ్‌మెంట్‌పైనే ఆదార‌ప డిన‌ట్లు తెలుస్తోంది. ఈక్ర‌మంలోనే ఇప్ప‌టికే గ్రామాల్లోకి భారీఎత్తున న‌గ‌దు, మ‌ద్యం చేరుకుంద‌నే వార్త‌లు గుప్పుమంటున్నాయి. డ‌బ్బునే న‌మ్ముకున్న గండ్ర నోట్ల క‌ట్టల‌తో ఓట్లు కొనుక్కునేందుకు సిద్ద‌మ‌య్యార‌న్న ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. అయితే.. అధికారం చేతులో ఉన్నా, యంత్రాంగం అనుకూలంగా ప‌నిచేస్తున్నా, ఓటుకు ఇంత రేట్ చొప్పున ఫిక్స్ చేసి పంపిణీ చేసేందుకు సి ద్ద‌మైనా ఈ ఎన్నిక‌ల్లో ఎలాంటి ఫ‌లితం ఉండ‌ద‌ని, ప్ర‌జ‌లు ఎమ్మెల్యే గండ్ర‌ను ఓడించేందుకు మాన‌సికంగా సిద్ద‌మ‌య్యార‌ని కాంగ్రెస్ నాయ‌కులు చెబుతున్నారు. గతాన్ని ప‌రిశీలిస్తే.. ప్ర‌జాబ‌లం ముందు పోల్ మేనేజ్‌మెంట్ ప‌నిచేయ‌ద‌న్న స‌త్యం అనేక ఎన్నిక‌ల్లో రుజువైంద‌ని పేర్కొంటున్నారు.

సొంత పార్టీ నేత‌ల‌కు న‌జ‌రానాలు..

 

గ‌తంలో జ‌రిగిన ఎన్నిక‌ల‌ను ఈసారి ఎన్నిక‌ల‌ను బేరీజు వేస్తే ఈసారి ఎన్నిక‌ల్లో భిన్న‌మైన ప‌రిస్థితి, ప‌రిణామాలు చాలా స్ఫ‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. గ‌తంలో ప్ర‌త్య‌ర్థి పార్టీల నేత‌ల‌కు, త‌న‌కు వ్య‌తిరేకంగా ప‌నిచేసే వాళ్ల‌ను ఎన్నిక‌ల్లో నిల‌బ‌డిన అభ్య‌ర్థులు ప్ర‌లోభాల‌కు గురిచేయ‌డం ప‌రిపాటిగా ఉండేది. కానీ ఈ సారి ఎన్నిక‌ల్లో భూపాల‌ప‌ల్లి నియోజ‌క‌ర్గంలో విచిత్రంగా గ‌తంలో ఎన్న‌డూలేని విధంగా సొంత పార్టీ నేత‌ల‌ను, ప్ర‌జాప్ర‌తినిధులను కాపాడుకునేందుకు ఎమ్మెల్యే గండ్ర వెంక‌ట ర‌మ‌ణారెడ్డి ప‌డ‌రాని పాట్లు ప‌డుతున్నారు. నాయ‌కులు చేజార‌కుండా ఉండేందుకు ప్ర‌జాప్ర‌తినిధుల‌కు న‌జ‌రానాలు ఫిక్స్ చేసి రాయ‌బారాలు న‌డుపుతూ వాళ్ల‌ను వేరే పార్టీలోకి వెళ్ల‌నీయ‌కుండా కాపాడుకుంటున్నార‌నే టాక్ వి నిపిస్తోంది. అయిన‌ప్ప‌టికీ ప‌లువురు నాయ‌కులు, ప్ర‌జాప్ర‌తినిధులు ఎమ్మెల్యే ఆఫ‌ర్‌ను సున్నితంగా తిర స్క‌రిస్తూ అధికార పార్టీని వీడి త‌మ‌దారి తాము చూసుకుంటుండ‌టంతో ఇక చేసేదేంలేక ఎమ్మెల్యే గండ్ర వెంకట ర‌మ‌ణారెడ్డి తీరా ఎన్నిక‌ల ముంగిట చేతులెత్తేశార‌ని సొంత పార్టీ నేత‌ల నుంచి గుస‌గుస‌లు విని పిస్తున్నాయి. మొత్తంగా భూపాల‌ప‌ల్లి నియోజ‌క‌ర్గంలో బ‌లంగా వీస్తున్న కాంగ్రెస్ గాలిని త‌ట్టుకుని ఈ ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యే గండ్ర నిల‌బ‌డ‌తారా..? పొలిటిక‌ల్ మేనేజ్‌మెంట్ తో గ‌తంలో లాగా గ‌ట్టు ఎక్కుతారా..? అన్న‌ది తేలాలంటే మాత్రం డిసెంబ‌ర్ 3 వ‌ర‌కు ఆగాల్సిందే..

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img