అక్షరశక్తి, పరకాల : పరకాల పట్టణానికి చెందిన రైతు దంపతులు రాచమల్ల రవి-అరుణ మూడు ఎకరాల భూమిని రూ.50వేలతో కౌలుకు తీసుకున్నారు. ఇందులో రెండుఎకరాల్లో మిర్చి, ఎకరంలో పుచ్చతోట సాగు చేశారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలతో మిర్చి, పుచ్చతోట వందశాతం దెబ్బతిన్నాయి. సుమారు ఈ పంటలకు రూ.4లక్షల 50వేల పెట్టుబడి పెట్టామని రైతు దంపతులు మంత్రుల ముందు కన్నీరుమున్నీరయ్యారు. మంత్రుల కాళ్లుపట్టుకుని తమను ఆదుకోవాలని వేడుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి రైతు దంపతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అధైర్య పడొద్దని, ఆదుకుంటామని హామీ ఇచ్చారు. రైతుకు సంబంధించిన ఆధార్‌కార్డు, బ్యాంక్ అకౌంట్ అధికారులు తీసుకున్నారు.