తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయం మరింత వేడెక్కుతోంది. అధికార, ప్రతి పక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పొలిటికల్ రేసులో ముందుండేందుకు ఎవరికి వారు మాటలను డైనమైట్లలా ప్రయోగిస్తున్నారు. మరి ఈ పోటీలో ఎవరు ఎక్కడ ఉన్నారు…? రాష్ట్రంలో దమ్మున్న నాయకుడు ఎవరై ఉంటారని ప్రజలు భావిస్తున్నారు…? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా… నేటి తరం ఇలాంటి ప్రశ్నలకు సమాధానం వెతికేది మాత్రం గూగుల్ లోనే… మరి తెలంగాణ రాష్ట్రంలో పవర్ ఫుల్ పొలిటీషియన్ ఎవరంటే గూగుల్ ఎవరి పేరు చెబుతోందో తెలుసా…? రేవంత్‌రెడ్డి అని. ఇందుకు సంబంధించిన వీడియోలను కొందరు కాంగ్రెస్ నాయకులు, రేవంత్ అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తుండగా ఇప్పడది వైరల్ అవుతోంది. తెలంగాణ టైగర్… ఇదీ రేవంత్ ఛరిష్మా అంటూ ఆయన అభిమానులు దీన్ని ట్రెండ్ చేస్తున్నారు.