Tuesday, September 10, 2024

మోడీ ఎనిమీ ఆఫ్ తెలంగాణ‌

Must Read

ట్విట్టర్‌లో నెంబర్ వన్ ట్రెండింగ్

సోష‌ల్ మీడియాలో టీఆర్ఎస్ వార్‌ అక్ష‌ర‌శ‌క్తి డెస్క్ : పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్రమోడీ చేసిన ప్రసంగం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చిచ్చు రేపుతోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై రాజ్య‌స‌భ‌లో నిన్న మోడీ చేసిన వ్యాఖ్య‌ల‌పై రాష్ట్ర‌వ్యాప్తంగా నిర‌స‌న‌లు హోరెత్తుతున్నాయి. మోడీ.. తెలంగాణ ద్రోహి అంటూ టీఆర్ఎస్ నాయ‌కులు ప్ర‌ధాని మోడీ దిష్టిబొమ్మ‌ల‌ను ద‌గ్ధం చేస్తున్నారు. పార్ల‌మెంట్ లోనూ ఆ పార్టీ ఎంపీలు త‌మ నిర‌స‌న గ‌ళం వినిపించారు. మోడీ వ్యాఖ్య‌ల‌పై ఆగ్రహం వ్య‌క్తం చేశారు. ఇక సోష‌ల్ మీడియాలోనూ టీఆర్ఎస్ యుద్ధం ఆగలేదు.

 

ట్విట్టర్‌లో బుధ‌వారం ఉద‌యం నుంచి వార్ కొన‌సాగుతూనే ఉంది. ప్రధానిని తెలంగాణకు శత్రువుగా చూపుతూ ట్విట్టర్‌లో టీఆర్ఎస్ పెట్టిన హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ అవుతుంది. మోడీ ఎనిమీ ఆఫ్ తెలంగాణ పేరిట హ్యష్‌ట్యాగ్ నెంబర్ వన్ గా నిలిచింది. గంటలోనే ఇరవై ఐదు వేల మంది దీనిని రీ ట్వీట్ చేయడం విశేషం. తెలంగాణ‌కు చెందిన నెటిజ‌న్లు, ప్ర‌జాప్ర‌తినిధులు, నాయ‌కులు, పార్టీ శ్రేణులు ట్విట్ట‌ర్ వేదిక‌గా మోడీ వ్యాఖ్య‌ల‌ను తీవ్రంగా ఖండించారు.

వివిధ రంగాల్లో తెలంగాణ‌పై కేంద్ర ప్ర‌భుత్వం చూపుతున్న నిర్ల‌క్ష్యాన్ని, వివ‌క్ష‌ను ఎండ‌గ‌ట్టారు. ఇటీవల మోడీ హైదరాబాద్ కు వచ్చినప్పుడు కూడా టీఆర్ఎస్ ప్ర‌ధానిని వ్యతిరేకిస్తూ హ్యాష్ ట్యాగ్ ను ట్రెండింగ్ లో పెట్టింది. మోడీ హైదరాబాద్ వస్తే కనీసం స్వాగత, వీడ్కోలు కార్యక్రమాల్లో కూడా కేసీఆర్ పాల్గొనలేదు. నిన్న పార్లమెంటులో తెలంగాణ ఆవిర్భావంపై మోడీ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు నిరసనకు దిగాయి. దీంతోపాటు తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయంపై నినదించేందుకు మోడీ ఎనిమీ ఆఫ్ తెలంగాణ హ్యాష్ ట్యాగ్ ను రూపొందించారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img