ఈటల రాజేందర్ సమక్షంలో చేరిక
అక్షరశక్తి, పరకాల : పరకాల నియోజకవర్గంలో బీజేపీలోకి చేరికల పర్వం కొనసాగుతోంది. దామెర మండలం పసరగొండ గ్రామానికి చెందిన సీనియర్ బీఆర్ఎస్ నాయకులు, మూడుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన బీసీ సామాజిక వర్గానికి చెందిన మంద ఐలయ్య సోమవారం సాయంత్రం హుజురాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ ఎన్నికలనిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ సమక్షంలో కమలాపూర్‌లో బీజేపీలో చేరారు. ఆయనతోపాటు బీఆర్ఎస్ ముఖ్య నాయకులు కౌటం ఐలయ్య చేరారు. దామెర మండలంలో బీసీ సామాజిక వర్గం మొత్తం బీజేపీతో ఉంటుందని, దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన సంక్షేమ పథకాలను చూసి బీజేపీలో చేరినట్లు మంద ఐలయ్య తెలిపారు. పరకాల నియోజకవర్గంలో బీజేపీని భారీ మెజారితో గెలిపించేందుకు తనవంతు కృషి చేస్తానని అన్నారు.