- నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి రావు పద్మకు బ్రహ్మరథం
- ఆడబిడ్డను అక్కున చేర్చుకుంటున్న ప్రజలు
- మంగళహారతులిచ్చి స్వాగతం పలుకుతున్న మహిళలు
- పాజిటివ్ వేవ్‌ను క్రియేట్ చేస్తున్న
బీసీ సీఎం నినాదం, ఎస్సీ వర్గీకరణ అంశం.. - అగ్రనేతల వరుస పర్యటనలతో మరింత హైప్..
- కదనోత్సాహంలో కమలదళం
అక్షరశక్తి, హన్మకొండ: వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి రావు పద్మకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఏ డివిజన్‌కు వెళ్లినా మహిళలు మంగళహారతులిచ్చి ఇంటి ఆడబిడ్డలాగా ఘనంగా స్వాగతం పలుకుతున్నారు. కేసులు, నిర్భంధాలను లెక్కచేయకుండా, నియోజకవర్గంలో అధికార పార్టీ ఆగడాలను ఎదురిస్తూ ఆత్మస్థైర్యంతో ముందుకుసాగుతున్న ఆడపడుచును ఓటర్లు అక్కున చేర్చుకుంటున్నారు. ఈసారి కాకపోతే ఇంకెప్పుడు అన్న ధోరణితో అక్కకు అవకాశం ఇవ్వాల్సిందేనన్న సంకల్పంతో స్వచ్చందంగా ప్రచారంలో భాగస్వాములువుతున్నారు. కరోనాలాంటి విపత్తు, వరంగల్‌లో వరదల సమయంలో నగర ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకున్న రావు పద్మకు విద్యార్థులు, నిరుద్యోగులు, మేధావులు జైకొడుతున్నారు. ఈక్రమంలోనే బీజేపీ ఎత్తుకున్న బీసీ సీఎం నినాదంతోపాటు ఎస్సీ వర్గీకరణ అంశం ప్రజల్లో పాజిటివ్ వేవ్ క్రియేట్ చేస్తోంది. మరోపక్క.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటనలు క్యాడర్‌లో జోష్ పెంచాయి. తాజాగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు, ఎంఎస్పీ నేత మంద కృష్ణ మాదిగ రావు పద్మకు మద్దతుగా ప్రచారం చేపట్టడంతో పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది.
అగ్రనేతల పర్యటనలతో జోష్..
వరంగల్ పశ్చిమ నియోజవర్గంపై బీజేపీ అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించింది. పరిస్థితులను బట్టి అగ్రనేతలను ప్రచారానికి దింపుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఖిలా వరంగల్‌లో ఈనెల 18న సకల జనుల విజయ సంకల్ప సభ పేరిట నిర్వహించిన భారీ బహిరంగ సభ విజయవం తమైంది. ఈనెల 22న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వరంగల్ పశ్చిమలో రావు పద్మకు మద్దతుగా చేపట్టిన ప్రచారం పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది. ఈక్రమంలోనే తాజాగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు, ఎంఎస్పీ అధినేత మంద కృష్ణ మాదిగ బీజేపీ అభ్యర్థి రావు పద్మకు మద్దతుగా హన్మకొండలో ప్రచారం నిర్వహించారు. సుబేదారిలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ఆడిటోరియం వద్ద ఏర్పాటు చేసిన సకల జనుల విజయ సంకల్ప సభకు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. బీజేపీని ఆదరించాలని, రావు పద్మకు ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. అగ్రనేతల వరుస పర్యటనలతో వరంగల్ పశ్చిమ బీజేపీలో జోష్ కనిపిస్తోంది.
ఒక్క అవకాశం ఇవ్వండి..
వరంగల్ పశ్చిమ బీజేపీ అభ్యర్థి రావు పద్మ ప్రచారంలో జోరు పెంచారు. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ అన్ని వర్గాల ప్రజల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుస్తున్నారు. ఆడబిడ్డను ఆశీర్వదించాలని కోరుతున్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరిస్తున్నారు. బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమని, పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలంటూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. కేంద్రం నిధులతోనే వరంగల్ మహానగరం అభివృద్ధి చెందుతోందని తెలియజేస్తూ, బీజేపీని గెలిపిస్తే మరింత అభివృద్ధి జరుగుతుందని చెబుతున్నారు. కాగా, మహిళా నేతగా, వరంగల్లో బీజేపీ బలోపేతానికి ఎంతో కృషి చేసిన రావు పద్మ.. అందరినీ సమన్వయం చేసుకుంటూ బూత్ స్థాయిలో పార్టీ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించి సఫలీకృతులయ్యారు. గత మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపులో కీలక పాత్ర పోషించారు. ఈక్రమంలోనే గులాబీ కంచుకోట వరంగల్ పశ్చిమ నుంచి బరిలోకి దిగిన రావు పద్మ బీఆర్ఎస్‌ను ఓడించి కాషాయ జెండా ఎగురవేయాలన్న పట్టుదలతో ముందుకు సాగుతున్నారు.