- ఒక్కరొక్కరుగా జారుకుంటున్న నేతలు
- తాజాగా కాంగ్రెస్‌లోకి రేవూరి ప్రకాశ్‌రెడ్డి?
- ఈనెల 18న చేరే అవకాశం
- గందరగోళంలో కాషాయదళం
- కాంగ్రెస్ వైపు కార్యకర్తల చూపు?
- సీన్‌లోకి దొడ్డ మోహన్‌రావు?
అక్షరశక్తి, ప్రధానప్రతినిధి : ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో బీజేపీ ఖాళీ అవుతోంది. నాయకులందరూ ఒక్కరొక్కరుగా జారుకుంటున్నారు. తాజాగా, మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరడం దాదాపుగా ఖాయమైపోయింది. ఈ నెల 18న ఢిల్లీలో అగ్రనేతల సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. ఇలా తీరా ఎన్నికల ముంగిట నేతలు ఎవరిదారి వారు చూసుకుంటుండడంతో క్యాడర్ గందరగోళంలో పడిపోతోంది. భరోసా ఇచ్చే నేత కరువవడంతో కార్యకర్తలు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. నర్సంపేట నియోజకవర్గంలో ఏర్పడిన ఈ పరిణామాలు బీఆర్ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డికి కలిసివస్తాయా..? లేక కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి సహకరిస్తాయా..? అన్నది ఇప్పుడు నియోజకవర్గ రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోంది.
కొద్దిరోజులుగా కీలక పరిణామాలు
కొంతకాలంగా నర్సంపేట నియోజకవర్గంలోని నర్సంపేట పట్టణం, ఖానాపురం, నెక్కొండ, చెన్నారావు, దుగ్గొండి, నల్లబెల్లి మండలాల్లో బీజేపీ నుంచి కార్యకర్తలు ఇతర పార్టీల్లోకి వెళ్లడం క్రమంగా పెరుగుతోంది.
నర్సంపేట పట్టణానికి చెందిన ఎస్సీ మోర్చా వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుంటి వీరప్రకాశ్, నర్సంపేట పట్టణ మహిళా మోర్చా అధ్యక్షురాలు అమల, వీరితోపాటు సుమారు 300మంది కాంగ్రెస్‌లో చేరారు. అలాగే, చెన్నారావుపేట మండల బీజేపీ ప్రధాన కార్యదర్శి బొంత సురేష్ కాంగ్రెస్‌లో చేరారు. నల్లబెల్లి మండల యువ మోర్చా నాయకుడు కాంగ్రెస్‌లో చేరారు. బీజేపీ నల్లబెల్లి మండల ఉపాధ్యక్షుడు, తెలంగాణ ఉద్యమ నాయకుడు ఐలయ్యయాదవ్‌తోపాటు పలువురు కాంగ్రెస్‌లో చేరారు. నెక్కొండకు చెందిన కీలక బీజేపీ నాయకుడు కూడా కాంగ్రెస్ వైపు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లో మరికొంత మంది బీజేపీ వీడి ఇతర పార్టీల్లోకి వెళ్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే.. బీజేపీ క్యాడర్ ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరే దిశగానే అడుగులు వేస్తున్నట్లు రాజకీయవర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
ఇతర పార్టీల్లోకి క్యాడర్…

సీన్‌లోకి దొడ్డ మోహన్‌రావు?
నర్సంపేట బీజేపీలో ఏర్పడిన గందరగోళ పరిస్థితులను చక్కదిద్దడానికి అధిష్ఠానం వెంటనే రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో పార్టీ నుంచి పోటీ చేయించేందుకు బలమైన నేతలను రంగంలోకి దించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా బీజేపీ నాయకురాలు రాణిరుద్రమ, ప్రముఖ సామాజిక సేవకుడు, పారిశ్రామికవేత్త, ఫార్మాకంపెనీ అధినేత అయిన దొడ్డ మోహన్‌రావు పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. దొడ్డ మోహన్‌రావు స్వగ్రామం చెన్నారావుపేట మండలం లింగగిరి. ఈ ప్రాంతంలో అనేక సేవా, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టిన వ్యక్తిగా మంచి పేరుంది. మిషన్ కాకతీయ పథకంలో భాగంగా నర్సంపేట నియోజకవర్గంలో పలు చెరువులకు సొంతంగా నిధులు ఇచ్చి పునరుద్ధరించారు. ఈ నేపథ్యంలో బీజేపీ అధిష్ఠానం దొడ్డ మోహన్‌రావును సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది.