Tuesday, June 18, 2024

జ‌గ‌న్‌తో చిరు భేటీ.. కీల‌క విష‌యాల వెల్ల‌డి

Must Read

ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డితో భేటీ చాలా సంతృప్తికరంగా, ఆనందంగా జరిగిందని హీరో చిరంజీవి అన్నారు. ఈ పండుగ పూట ఒక సోదరుడుగా నన్ను ఆహ్వానించి విందు భోజనం పెట్టడం సంతోషంగా ఉందన్నారు. గురువారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌తో చిరంజీవి భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి బాధలను సీఎంకు వివరించానని చెప్పారు. ఇండస్ట్రీ, ఎగ్జిబిటర్ల సాధక బాధలు సీఎంకు వివరించాన‌ని, తాను చెప్పిన అన్ని విషయాలను సీఎం సానుకూలంగా ఆలకించారని చిరు చెప్పారు.

 

సినీ ఇండస్ట్రీ విషయంలో సీఎం జగన్ స్పందన సంతృప్తినిచ్చిందని ఆయ‌న అన్నారు. పైకి క‌నిపించినంత‌ గ్లామర్ గా సినీ ఫీల్డ్ ఉండదని, రెక్కాడితే గాని డొక్కాడని పేదలు ఇండస్ట్రీని నమ్ముకుని ఉన్నారని, థియేట‌ర్ల‌ యజమానులకూ అనేక బాధలు ఉన్నాయని చెప్పిన‌ట్లు చిరు వెల్ల‌డించారు. సినిమాహాళ్లని మూసేస్తేనే బెటర్ అనే భావనకు కొందరు థియేటర్ యజమానులు వ‌చ్చార‌ని, ఈ సమస్యలన్నీ సీఎంకు వివరించానని చిరంజీవి అన్నారు. అన్ని రకాలుగా ఆలోచించే నిర్ణయం తీసుకుంటామని సీఎం జగన్ చెప్పారని, టిక్కెట్ ధరలపై జారీ చేసిన జీవోను సీఎం పునః పరిశీలిస్తామని హామీ ఇచ్చార‌ని చిరు ఆనందం వ్య‌క్తం చేశారు. ఈ సీఎంతో సమావేశం వివరాలను సినీ ఇండస్ట్రీలోని చిన్నా పెద్దలకు కూడా తెలియజేస్తానని చిరంజీవి చెప్పుకొచ్చారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img