Monday, June 17, 2024

చిరంజీవితో క‌లిసి అందుకే వెళ్ల‌లేదు..

Must Read

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌ను గురువారం హీరో చిరంజీవి క‌లిశారు. ఏపీలో సినిమా టికెట్ల ధ‌ర‌ల పెంపు కోసం, కార్మికుల స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించేందుకు క‌లిశారు. అయితే.. తెలుగు ఇండ‌స్ట్రీ నుంచి కేవలం చిరంజీవి మాత్ర‌మే సీఎం జ‌గ‌న్‌ను క‌ల‌వ‌డంపై ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది. ఇదే స‌మ‌యంలో చిరంజీవి వెంట ఎందుకు వెళ్ల‌లేదంటూ ఉత్ప‌న్న‌మైన ప్ర‌శ్న‌కు హీరో నాగార్జున స్పందించారు. తాను జ‌న‌వ‌రి 14వ తేదీన విడుద‌ల కానున్న బంగార్రాజు సినిమా ప్ర‌మోష‌న్ వ‌ర్క్‌లో బిజీగా ఉన్నాన‌ని, అందుకే వెళ్ల‌లేద‌ని చెప్పుకొచ్చారు. చిరంజీవి ఇండ‌స్ట్రీ త‌రుపున వెళ్లార‌ని నాగార్జున అన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img