Friday, September 13, 2024

ఐలాపురం వేణుచారి నామినేష‌న్‌

Must Read

టీడీపీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా వ‌రంగ‌ల్ ప‌శ్చిమ నుంచి బ‌రిలోకి..
అక్ష‌ర‌శ‌క్తి, వరంగల్ పశ్చిమ: తెలంగాణ ద్ర‌విడ ప్ర‌జ‌ల పార్టీ (టీడీపీపీ) వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఐలాపురం వేణుచారి నామినేష‌న్ దాఖ‌లు చేశారు. శుక్ర‌వారం హ‌న్మ‌కొండ‌లో రిట‌ర్నింగ్ అధికారికి నామినేష‌న్ ప‌త్రాలు అంద‌జేశారు. విశ్వబ్రాహ్మ‌ణ హెల్పింగ్ సొసైటీ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడిగా, విశ్వ‌బ్రాహ్మ‌ణ యూత్ అసోసియేష‌న్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న వేణుచారి ద‌శాబ్ధ‌కాలంగా అనేక సామాజిక సేవా కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారు. విద్యార్థి ఉద్యమాల‌తోపాటు తెలంగాణ కోసం పోరాటం చేశారు. విశ్వబ్రాహ్మ‌ణ హెల్పింగ్ సొసైటీ ద్వారా రాష్ట్ర‌వ్యాప్తంగా అనేక మందికి ఆర్థిక‌సాయం అంద‌జేస్తున్నారు. ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలోని ప‌లు డివిజ‌న్ల‌లో ఆయ‌న‌కు అనుచ‌రులున్నారు. అదేవిధంగా మహిళా సంఘా లు, బీసీ సంఘాల‌తోపాటు అనేక కుల సంఘాల నాయ‌కుల‌తో మంచి సంబంధాలున్నాయి. ఈనేప‌థ్యంలో నే సుప్రీంకోర్టు న్యాయ‌వాది పూసాల శ్రీకాంతాచారి ఆధ్వ‌ర్యంలో రాష్ట్రంలో కొత్త‌గా పురుడుపోసుకున్న తెలంగాణ ద్ర‌విడ ప్ర‌జ‌ల పార్టీ (టీడీపీపీ) నుంచి వ‌రంగ‌ల్ ప‌శ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఐలాపురం వేణుచారి బ‌రిలోకి దిగారు. ఈసందర్భంగా వేణుచారి మాట్లాడుతూ.. త‌న‌ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే వ‌రంగ‌ల్ ప‌శ్చిమ నియోజ‌క‌వర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తాన‌ని అన్నారు. త‌న‌కు ఒక్క అవ‌కాశం ఇవ్వాల‌ని కోరారు. ఆయ‌న వెంట పెద్దోజు వెంక‌టాచారి, నారాయ‌ణ‌గిరి రాజు, గుంపెల్లి గౌత‌మ్ ఉన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img